Fri Mar 27 2026 19:37:14 GMT+0530 (India Standard Time)
టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే
నారా లోకేష్ యువగళం పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే షాజహాన్ భాషా చేరనున్నారు.

నారా లోకేష్ యువగళం పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే షాజహాన్ భాషా చేరనున్నారు. లోకేష్ పాదయాత్రలోనే ఆయన పార్టీలో చేరతానని ప్రకటించారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న షాజహాన్ భాషా గతంలో మదనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా పేరు పొందారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేగా...
ఇటీవల కాంగ్రెస్ అధినాయకత్వం ఏఐసీసీలోనూ సభ్యుడిగా పదవి ఇచ్చింది. అయితే ఆయన టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత మదననపల్లి వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు మహ్మద్ నవాజ్ భాషా సోదరుడు షాజ్‌హాన్ భాషా. తన సోదరుడితో రాజకీయంగా గిట్టక ఆయన టీడీపీలో చేరుతున్నారు. పార్టీ అవకాశమిస్తే తాను వచ్చే ఎన్నికల్లో తన సోదరుడిని ఎదుర్కొంటానని షాజహాన్ భాషా చెబుతున్నారు. ఆయన
Next Story

