Sat Mar 07 2026 11:49:28 GMT+0530 (India Standard Time)
ఆసుపత్రిలో చేరిన రత్నకుమారి
మాజీ ఎమ్మెల్యే రత్నకుమారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెను కుటుంబ సభ్యులు విజయవాడలోని హెల్ప్ ఆస్పత్రికి తరలించారు.

మాజీ ఎమ్మెల్యే రత్నకుమారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెను కుటుంబ సభ్యులు విజయవాడలోని హెల్ప్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. రత్నకుమారి అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే రత్నకుమారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
హెల్ప్ ఆసుపత్రి వద్దకు...
ఇటీవల వంగవీటి రాధా వివాహం సందర్భంగా ఆమె కనిపించారు. ఈరోజు ఉదయం నలతగా ఉందని చెప్పిన రత్నకుమారి తర్వాత తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వంగవీటి రత్నకుమారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకునేందుకు మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా చేరుకున్నారు. రత్నకుమారి ఆరోగ్యం బాగా లేదని తెలిసి పెద్ద సంఖ్యలో రంగా అభిమానులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు
Next Story

