Sun Nov 03 2024 04:18:09 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : వైసీపీకి మాజీ ఎమ్మెల్యే గుడ్ బై
మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారు. త్వరలోనే వైసీపీకి రాజీనామా చేస్తానని తెలిపారు
మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారు. త్వరలోనే వైసీపీకి రాజీనామా చేస్తానని తెలిపారు. తనను కాదని రాజోలు టిక్కెట్ ను గొల్లపల్లి సూర్యారావుకు టిక్కెట్ ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు. తనను పార్లమెంటుకు పోటీ చేయించినప్పుడే అయిష్టంగా వెళ్లానని రాపాక వరప్రసాదరావు తెలిపారు. ఆయన ఒక వీడియో విడుదల చేశారు.
ఏ పార్టీలో చేరేది...
అయితే తాను ఏ పార్టీలోకి వెళ్లాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. తాను వైసీపీ నుంచి మాత్రం వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. తనకు వైసీపీలోకి కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగానే వచ్చానని ఆయన తెలిపారు. తాను వైసీపీలో ఉండలేనని పార్టీ పెద్దలకు చెప్పానన్న రాపాక వరప్రసాదరావు ఈ విషయం తాను కార్యకర్తల సమావేశంలో బహిరంగంగా చెబుతానని తెలిపారు.
Next Story