Thu Jan 29 2026 12:23:56 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యే ప్రసన్న మరోసారి సవాల్
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై మరోసారి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శలు చేశారు

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై మరోసారి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శలు చేశారు. డబ్బుందన్న అహంకారంతో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్ది ఇలాంటి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. దాడులు చేసే సంస్కృతిని ప్రశాంతి రెడ్డి జిల్లాకు పరిచయం చేశారని ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. దాడులు జరిగిన తర్వాత తనకు తెలియదని చెప్పడం ఎవరూ నమ్మరని ప్రసన్న అన్నారు.
ఎవరొస్తారో రండి అంటూ...
కేసులకు, అరెస్టులకు భయపడే మనస్తత్వం తనది కాదని ప్రసన్న కుమార్ రెడ్డి తెలిపారు. తాను నిన్న చెన్నైలో హాస్పిటల్కి వెళ్తే తాను పారిపోయినట్లు ప్రచారం చేశారన్న ప్రసన్న తన కాళ్ళు, చేతులు కట్టేసి తన కాళ్ల కింద పడేయ్యమని ప్రశాంతి రెడ్డి చెప్పారని తనకు తెలిసిందన్నారు. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నానని, ఎవరోస్తారో రండి అంటూ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సవాల్ విసిరారు.
Next Story

