Thu Feb 12 2026 12:48:14 GMT+0530 (India Standard Time)
Pinnelli : ఏ క్షణమైనా పిన్నెల్లి అరెస్ట్.. మొహరించిన పోలీసులు
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈరోజు అరెస్ట్ చేసే అవకాశముంది.

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈరోజు అరెస్ట్ చేసే అవకాశముంది. హైకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో ఆయనపై కేసు నమోదయింది. దీంతో పాటు మూడు ఘటనల్లో హత్యాయత్నం ఘటనలు నమోదయ్యాయి.
అరెస్ట్ చేయకుండా...
దీంతో ఆయన తనను అరెస్ట్ చేయకుండా హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే న్యాయస్థానం కౌంటింగ్ పూర్తయ్యేంతవరకూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన గడువు నిన్న అర్థరాత్రితో ముగిసింది. దీంతో ఆయన తప్పించుకుని మళ్లీ పోకుండా పోలీసులు ఆయన ఉన్న ప్రాంతమంతా పహారా కాస్తున్నారు. ఏక్షణమైనా అరెస్ట్ చేేసే అవకాశముంది.
Next Story

