Mon Mar 16 2026 01:09:37 GMT+0530 (India Standard Time)
తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి టీడీపీ నేత
నూజివీడు టీడీపి మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు వైసీపీలో చేరనున్నారు

నూజివీడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు వైసీపీలో చేరనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలోకి ముద్రబొయిన వెంకటేశ్వరరావు వచ్చారు. ఆయన వైసీపీలో చేరనున్నారు. నూజివీడు టీడీపీ టిక్కెట్ వైసీపీ నుంచి టీడీపీ లోకి వెళ్లిన పార్థసారధికి కేటాయిస్తామని చంద్రబాబు ఆయనకు చెప్పడంతో ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
వైసీపీలో చేరేందుకు...
తాను నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇన్నేళ్లు చేసిన కష్టాన్ని పట్టించుకోలేదని, పారాచూట్ నేతలకు టిక్కెట్లు చంద్రబాబు ఇస్తున్నారని ముద్రబోయిన వెంకటేశ్వరరావు అంటున్నారు. చంద్రబాబు తనకి అన్యాయం చేశాడని నిన్న కార్యకర్తల సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్న ముద్రబొయిన నేడు తాడేపల్లి కార్యాలయానికి రావడం విశేషం.
Next Story

