Thu Dec 18 2025 05:14:01 GMT+0000 (Coordinated Universal Time)
జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే
ప్రకాశం జిల్లా మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు జనసేన పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లో చేరికలు ప్రారంభమయ్యాయి. పార్టీని వీడటం, వేరే పార్టీలో చేరడం వంటివి మొదలయ్యాయి. ఎన్నికలలో పోట ీచేసేందుకు నేతలు తమకు నచ్చిన, మెచ్చిన పార్టీని ఎంచుకుంటున్నారు. తమ రాజకీయ భవిష్యత్ బాగుంటుందని భావించిన నేతలు ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు జనసేన పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నేడు చేరిక?
ఆయన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి సుదీర్ఘకాలం కొనసాగారు. 1994లో ఒంగోలు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లో ప్రకాశం జిల్లా జడ్పీ ఛైర్మన్ గా కూడా ఈదర హరిబాబు పని చేశారు. అయితే ఆయన ఆదివారం జనసేనలో చేరే అవకాశముంది. జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారని తెలిసింది. ఈదర హరిబాబు చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు.
Next Story

