Thu Feb 06 2025 16:47:34 GMT+0000 (Coordinated Universal Time)
గవర్నర్ జోక్యం చేసుకోవాలన్న వైసీపీ
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అరాచాకాలకు పాల్పడుతుందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అరాచాకాలకు పాల్పడుతుందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని తెలిపారు. పోలీసులు, అధికారులు కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తూ బలం లేకపోయినా గెలిచినట్లు ప్రకటిస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. తమ నేత చెప్పినట్లు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పుడు అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు.
పిడుగురాళ్ల ఎన్నిక వాయిదా...
పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవి ఎన్నిక మరోసారి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో మరోసారి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. నిజానికి నిన్ననే మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవి జరగాల్సి ఉంది. అయితే నిన్న కోరం లేక వాయిదా వేసింది. కానీ ఈరోజు కూడా కోరం సరిగా లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేశారు.
Next Story