Fri Jan 30 2026 11:02:55 GMT+0000 (Coordinated Universal Time)
తాడిపత్రిలో ప్రత్యక్షమైన కేతిరెడ్డి పెద్దారెడ్డి
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి శనివారం ఉదయం తాడిపత్రికి వచ్చారు.

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి శనివారం ఉదయం తాడిపత్రికి వచ్చారు. నేరుగా పట్టణ పోలీస్ స్టేషను వెళ్లారు. ఎన్నికల సమయంలో అల్లర్ల కేసుకు సంబంధించి ఇటీవల పెద్దారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో స్టేషన్లో సంతకాలు చేసేందుకు వచ్చినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.
బహిష్కరించాలంటూ..
అయితే పెద్దారెడ్డిని రాష్ట్రం నుంచి బహిష్కరణ చేయాలని నిన్ననే జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. పెద్దారెడ్డి వల్ల తమ కుటుంబాలకు ప్రాణహాని ఉందని, ఆయనను బహిష్కరించాలని కోరిన మరుసటి రోజే పెద్దారెడ్డి తాడిపత్రిలో ప్రత్యక్షమయ్యారు. తాడిపత్రి జేసీ జాగీరు కాదని, తాను ఎక్కడికైనా వచ్చే హక్కు ఉందని, తనను బహిష్కరించే హక్కు ఎవరికీ లేదని పెద్దారెడ్డి అన్నారు.
Next Story

