Fri Dec 05 2025 11:17:07 GMT+0000 (Coordinated Universal Time)
Tadipathri : తాడిపత్రిలో హై అలెర్ట్
నేడు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లనున్నారు

నేడు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో తాడిపత్రికి వెళ్లనున్న పెద్దారెడ్డికి అవసరమైన బందోబస్తు కల్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఇప్పటికే పెద్దారెడ్డి జిల్లా ఎస్పీకి అందించారు. తనను తాడిపత్రికి వెళ్లేందుకు అవసరమైన బందోబస్తు ఇవ్వాలని కోరారు.
నేడు పెద్దారెడ్డి వస్తుండటంతో...
గతంలో హైకోర్టు చెప్పినప్పటికీ తాడిపత్రికి రాకుండా ఇటీవల పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు తర్వాత హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. నేడు తాడిపత్రికి పెద్దారెడ్డి వస్తారని తెలియడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం కూడా అలెర్ట్ అయింది. ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారన్న సమాచారంతో పోలీసులు తాడిపత్రిలో హై అలెర్ట్ ను ప్రకటించారు. అయితే అనంతపురం జిల్లా ఎస్పీ పెద్దారెడ్డికి ఈరోజు తాము భద్రత కల్పించలేమని, ఐదో తేదీ తర్వాత తాడిపత్రికి వెళ్లాలని సూచించడంతో అందుకు పెద్దారెడ్డి అంగీకరించారు.
Next Story

