Fri Mar 20 2026 22:09:16 GMT+0530 (India Standard Time)
వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరికపై జ్యోతుల నెహ్రూ ఏమన్నారంటే?
జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు టీడీపీలో చేరికపై మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పందించారు

జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు టీడీపీలో చేరికపై మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పందించారు. మన పార్టీ వైపు చూసే వారి గురించి మనం ఆలోచించడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. జ్యోతుల చంటి బాబు పేరు నేరుగా ప్రస్తావించకుండా ఆయన టీడీపీలో చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.
వచ్చే నెల 6న...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తనకు ఫోన్ చేసి చేరికల గురించి చెప్పారని జ్యోతుల నెహ్రూ చెప్పారు. జనవరి 6వ తేదీన పార్టీలో చేరికలు ఉంటాయని ఆయన అన్నారు. ఎవరు చేరినా స్వాగతించాల్సిందేనని, పార్టీని బలోపేతం చేయడం కోసం, టీడీపీ అధికారంలోకి రావడం కోసం అందరూ అధినాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని జ్యోతుల నెహ్రూ అన్నారు.
Next Story

