Mon Feb 02 2026 04:45:22 GMT+0000 (Coordinated Universal Time)
అవును... అక్కడ క్యాసినో వాస్తవమే
మంత్రి కొడాలి నాని పై మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఫైర్ అయ్యారు

మంత్రి కొడాలి నాని పై మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఫైర్ అయ్యారు. తప్పు చేసిన కొడాలి నాని బుకాయిస్తున్నారన్నారు. గుడివాడను గోవాగా మర్చేశారన్నారు. అందుకు తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ధూళిపాళ్ల నరేంద్ర చెప్పారు. ఈ మేరకు ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయంలో బయటపెట్టారు. సోషల్ మీడియాలో గుడివాడలో జరిగిన క్యాసినోకు సంబంధించి వేల సంఖ్యలో వీడియోలు ఉన్నాయన్నారు.
బర్త్ రఫ్ చేయాలి.....
గుడివాడలో క్యాసినో జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో నిర్వాహకులు విపరీతంగా ప్రచారం చేశారని, అయినా పోలీసులు మాత్రం పట్టించుకోలేదని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్, డీజీపీలు దీనిపై నోరు మెదపకపోవడమేంటని ప్రశ్నించారు. క్యాసినో నిర్వహణకు కారణమైన మంత్రి కొడాలి నానిని వెంటనే మంత్రి వర్గం నుంచి బర్త్ రఫ్ చేయాలని ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు.
Next Story

