Sat Mar 07 2026 11:49:28 GMT+0530 (India Standard Time)
చంపేందుకు నియమించిన షూటర్ ఎవరు?
దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తనకు ప్రాణహాని ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తనకు ప్రాణహాని ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే అయిన చింతమనేని ప్రభాకర్ ను చంపడానికి ఒక షూటర్ నియమించినట్లు ఒక ఆగంతకుడు ఫోన్ చేసి చెప్పినట్లు ఏలూరు మూడో టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందింది.
జీతాలు చెల్లించే....?
చింతమనేని ప్రభాకర్ ఫిర్యాదులో అనేక అంశాలు ప్రస్తావించారు. తనను హత్య చేసేందుకు ప్రత్యర్థులు కుట్ర పన్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను గన్ మెన్ జీతాలు చెల్లించే స్థోమత కూడా లేదని ఆయన పేర్కొన్నారు. పోలీసులే తనకు భద్రత కల్పించాలని ఆయన కోరారు. ఇటీవల ఏలూరు కోర్టులో కూడా ఇదే తరహా పిటిషన్ ను చింతమనేని ప్రభాకర్ వేసిన సంగతి తెలిసిందే. పోలీసులు ఆయన ఫిర్యాదును పరిశీలిస్తున్నారు.
Next Story

