Fri Jan 30 2026 12:29:16 GMT+0000 (Coordinated Universal Time)
నేను పారిపోలేదు.. అది నా వ్యసనం
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన తప్పుును అంగీకరించారు. పటాన్ చెరు కోడిపందేలకు వెళ్లినట్లు అంగీకరించారు.

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన తప్పుును అంగీకరించారు. పటాన్ చెరు కోడిపందేలకు వెళ్లినట్లు అంగీకరించారు. పటాన్ చెర్వు మాత్రమే కాదు తాను కర్ణాటక కూడా కోడిపందేల కోసం వెళతానని చింతమనేని ప్రభాకర్ ఒప్పుకున్నారు. కోడిపందేలు ఆడటం తన వ్యసనమని చెప్పారు.
నేరమో.. ఘోరమో...
కోడిపందాలు ఆడటం నేరమో, ఘోరమో కాదని ఆయన అన్నారు. తాను కర్ణాటక, పటాన్ చెరు లో కోడిపందేలు ఆడటం కోసం వెళ్లింది వాస్తవమేనని అన్నారు. చట్టప్రకారం నేరం కాబట్టి తాను పోలీసులు వచ్చే సమయంలో అక్కడి నుంచి తప్పుకున్నానని ఆయన తెలిపారు. తాను పారిపోయాననడం కరెక్ట్ కాదన్నారు. చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించాల్సిన బాధ్యత తనపై ఉందని, కానీ తన బలహీనతను ఆపుకోలేకనే అక్కడకు వెళ్లానని చింతమనేని ప్రభాకర్ అన్నారు.
Next Story

