Sat Dec 06 2025 02:09:29 GMT+0000 (Coordinated Universal Time)
కొడాలి నాని సవాల్ ను స్వీకరిస్తున్నాం.. పక్కా ఆధారాలున్నాయ్
మంత్రి కొడాలి నాని సవాల్ ను తాము స్వీకరిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.

మంత్రి కొడాలి నాని సవాల్ ను తాము స్వీకరిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. గుడివాడలో కె కన్వెష్వన్ లో క్యాసినో ద్వారా జూదం జరిగిందని తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని తెలిపారు. తాము ఆధారాలు చూపిస్తామని, కొడాలి నాని చేసిన తప్పులు ఒప్పుకుని రాజీనామా చేస్తారా? అని బొండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. కొడాలి నాని ఉత్తుత్తి ఛాలెంజ్ లు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
తమపై హత్యాయత్నం....
గుడివాడలో తమను పర్యటించకుండా పోలీసుల సహకారంతో వైసీపీ శ్రేణులు అడుగడుగునా అడ్డుకున్నాయని బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. కొడాలి నాని బండారం బయటపడుతుందని భయపడినట్లున్నారన్నారు. తమ వాహనాలను ధ్వంసం చేశారని, తమపై హత్యాప్రయత్నం జరిగిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమయిందన్న బొండా ఉమామహేశ్వరరావు పోలీసులు స్పందించకుంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు. తన సవాల్ కు కొడాలి నాని కట్టుబడి ఉండాలని కోరారు.
Next Story

