Wed Mar 18 2026 21:48:26 GMT+0530 (India Standard Time)
దేవినేని దందాలు అన్నీ ఇన్నీ కావు
బెజవాడలో దందాలు చేస్తున్న దేవినేని అవినాష్ ను ప్రోత్సహిస్తుంది ముఖ్యమంత్రి జగన్ అని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ అన్నారు

బెజవాడలో దందాలు చేస్తున్న దేవినేని అవినాష్ ను ప్రోత్సహిస్తుంది ముఖ్యమంత్రి జగన్ అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ అన్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడారు. వంగవీటి రంగా చనిపోయినప్పుడు కొడాలి నాని దేవినేని నెహ్రూ వద్దనే ఉన్నాడని ఆరోపించారు. రంగా హత్య జరిగినప్పుడు నెహ్రూ దొడ్లోనే ఉన్నాడని తెలిపారు. రంగా వర్ధంత ఎవరు నిర్వహించాలో చెప్పడానికి కొడాలి నాని ఎవరని బొండా ఉమ ప్రశ్నించారు. విజయవాడలో వ్యభిచార గృహాలు, మసాజ్ పార్లర్లు, సెటిల్మెంట్లు చేస్తుంది దేవినేని అవినాష్ కాదా? అని ఆయన ప్రశ్నించారు.
పాదయాత్ర ప్రకటనతో వణుకు...
లోకేష్ పాదయాత్ర ప్రకటనతో వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. యువగళంతో ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారపోతుందన్నారు. కందుకూరు ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని బొండా ఉమ అన్నారు. పోలీసుల వైఫల్యాన్ని పార్టీ పైకి నెట్టి ప్రయోజనం లేదన్నారు. ప్రతిపక్ష నేతకు భద్రత కల్పించడంలో డీజీపీ వైఫల్యం చెందారని ఆరోపించారు. చంద్రబాబు సభలకు లక్షల మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని ఆయన అన్నారు. అది చూసి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్న జగన్ కు వణకు మొదలయిందని అన్నారు.
Next Story

