Fri Dec 05 2025 11:19:46 GMT+0000 (Coordinated Universal Time)
పార్టీ మార్పుపై ఆదిమూలపు సురేష్ ఏమన్నారంటే?
మాజీ మంత్రి వైసీపీ కొండేపి ఇన్ ఛార్జి ఆదిమూలపు సురేష్ తాను పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చారు.

మాజీ మంత్రి వైసీపీ కొండేపి ఇన్ ఛార్జి ఆదిమూలపు సురేష్ తాను పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చారు. తాను జగన్ వెంటే ఉంటానని ఆయన తెలిపారు.తన ప్రాణం ఉన్నంతవరకు వైసీపీ తోనే తన ప్రయాణమని ఆదిమూలపు సురేష్ అన్నారు. తాను పార్టీ మారబోతు న్నాననే గాసిప్స్, ప్రచారం ఎవరు సృష్టిస్తున్నారో తనకు తెలియదన్నారు. ఒక దళితుడనైన తాను ఈ స్థాయికి ఎదిగానంటే అది జగన్ నాకు కల్పించిన అవకాశాలు మాత్రమేనని తెలిపారు.
అదంతా ప్రచారమే...
2016లో కూడా తనపై ఇటువంటి గాసిప్స్ ప్రయోగం చేశారన్న సురేష్ ఇటువంటి ప్రచారాలు సొంతపార్టీనాయకులు చేస్తున్నారా లేక కూటమీ పార్టీ నాయకుల ఎత్తుగడలా అనేది తనకు తెలియదని తెలిపారు. ఇటువంటి ప్రచారాలను ప్రజలు నమ్ముతారను కోవడం వారి భ్రమ అని అన్నారు. తాను పార్టీ మారాలనే యోచనలో లేను కాబట్టే జస్ట్ సోషల్ మీడియాలో ఖండించానని తెలిపారు.
Next Story

