Thu Mar 19 2026 04:14:02 GMT+0530 (India Standard Time)
జగన్ కు చెబుతున్నా వినలేదు
రాజధాని అమరావతి పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు.

రాజధాని అమరావతి పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. ఈ తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంప పెట్టు అని అన్నారు. తీర్పును తాము స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. తాము తొలి నుంచి మూడు రాజధానుల బిల్లు చెల్లదని చెబుతూనే ఉన్నామని యనమల రామకృష్ణుడు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడంతో న్యాయస్థానాల్లో ఇది నిలవదని తమకు తెలుసునన్నారు.
మొండిగా ముందుకు వెళితే...
అయినా ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుపై ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్లిందని యనమల రామకృష్ణుడు తెలిపారు. హైకోర్టు తీర్పుతోనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రాజధాని అమరావతి నిర్మాణానికి నడుంబిగించాలని ఆయన కోరారు. మరో అప్పీల్ కు వెళ్లకూడదని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు చెప్పిన విధంగానే రాజధానిని అభివృద్ధి చేసి రైతులకు ప్లాట్లు కేటాయించాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ప్రభుత్వం దుందుడుకు నిర్ణయాలతో ఇప్పటికే అభివృద్ధి అనేది ఏమీ లేకుండా పోయిందని అన్నారు.
Next Story

