Thu Mar 19 2026 04:11:09 GMT+0530 (India Standard Time)
జగన్ ది పైశాచికానందం
సెంబ్లీలో జరిగిన ఘటనపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు

అసెంబ్లీలో జరిగిన ఘటనపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడలేదన్నారు. జగన్ తన ఎమ్మెల్యలే చేత తిట్టించి పైశాచికానందం పొందుతున్నారని యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్ ఒక సైకోలాగా ప్రవర్తిస్తున్నాడని యనమల అన్నారు.
ఎన్టీఆర్ లాగానే.....
అసెంబ్లీలో నోరు జారితే తిరిగి క్షమాపణలు చెప్పిన ఘటనలు అనేకం ఉన్నాయన్నారు. ఎన్టీఆర్, వైఎస్ లాంటి వాళ్లే వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారని యనమల అన్నారు. కానీ జగన్ మాత్రం నిందలు వేసి నవ్వుకుంటున్నారన్నారు. ఈ ప్రభుత్వం కూలిపోయే రోజు దగ్గరలోనే ఉందని యనమల శాపనార్థాలు పెట్టారు. ఎన్టీఆర్ కూడా ముఖ్యమంత్రిగానే సభలోకి అడుగుపెడతానని బహిష్కరించి తిరిగి సభకు వచ్చారని, చంద్రబాబు కూడా అలాగే సీఎం గానే అడుగు పెడతారని యనమల రామకృష్ణుడు ఆకాంక్షించారు.
Next Story

