Fri Dec 05 2025 14:14:08 GMT+0000 (Coordinated Universal Time)
ర్యాంకింగ్ లన్నీ అబద్ధమే
జగన్ చెప్పే ర్యాంకింగ్ లన్నీ ఒట్టి అబద్ధమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.

జగన్ చెప్పే ర్యాంకింగ్ లన్నీ ఒట్టి అబద్ధమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్ కక్ష సాధింపు చర్యల్లో నెంబర్ వన్ స్థానమని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి రేటు నెగిటివ్ దిశగా వెళుతుందని ఆయన మండి పడ్డారు. సామాన్యుల ఆదాయం పెరగడం లేదని, కొందరే ధనికులుగా మారుతున్నారని యనమల అన్నారు. పారిశ్రామికాభివృద్ధి ఎక్కడా కనపడటం లేదని ఆయన అన్నారు. పెట్టుబడులకు ఎవరూ ముందుకు రాకపోవడమే ఇందుకు ఉదాహరణ అని ఆయన అన్నారు.
లక్షల కోట్ల అప్పు...
జగన్ నియంత అని యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు. పది లక్షల కోట్ల అప్పుదిశగా రాష్ట్రం వెళుతుందని ఆయన అన్నారు. అప్పులు చెల్లించడానికే లక్షల కోట్లు అవసరమవుతాయని ఆయన అన్నారు. ఆదాయం లేక సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు. ప్రభుత్వ భూములన్నీ జగన్ బినామీల పరమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పేరు చెబితేనే భయపడిపోతున్నారన్నారు.
Next Story

