Mon Dec 09 2024 07:14:02 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ పై యనమల ఫైర్
వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు
వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ రెడ్డి తన అవినీతి కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నారన్నారు. ప్రజలపై భారం మోపుతున్నా జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో నోరు మెదపడం లేదని యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు. చిన్న చిన్న రాష్ట్రాలే ప్రశ్నిస్తున్నా, జగన్ ప్రభుత్వం మాత్రం మౌనంగా చూస్తూ ఊరుకుంటుందని ఆయన మండి పడ్డారు.
జీఎస్టీ సమావేశంలో..
చివరకు పెరుగు, తెనె, చేపలు, మాంసం వంటి ఆహార పదార్థాలపై జీఎస్టీ విధిస్తున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ పార్టీ నోరు మెదపలేదన్నారు. ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా దారుణంగా విఫలమయిందన్నారు. జీఎస్టీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతు తెలుపుతూ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.
Next Story