Sun Mar 08 2026 03:13:07 GMT+0530 (India Standard Time)
అదానికే ఆ ప్లాంట్ అంకితం.. సోమిరెడ్డి విమర్శలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండి పడ్డారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండి పడ్డారు. పవర్ ప్లాంట్ కోసం భూములిచ్చిన ప్రజల సమస్యలను ప్రభుత్వం ఇంతవరకూ పట్టించుకోలేదని ఆయన అన్నారు. సమస్యలను పరిష్కరించకుండా ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 27న ప్లాంట్ ను ప్రారంభించడానికి నెల్లూరు జిల్లాకు వస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు.
నిర్భంధంలో...
ఈ ప్లాంట్ ను అదానికి జగన్ అంకితం చేయబోతున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. భూములు అప్పగించిన గ్రామాల ప్రజలు ఎటువంటి నిరసన తెలియజేయకుండా నిర్భంధంలోకి పోలీసులు తీసుకుంటున్నారని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ఎలా ప్లాంట్ ను ప్రారంభిస్తారని ఆయన నిలదీశారు.
Next Story

