Fri Mar 20 2026 09:02:22 GMT+0530 (India Standard Time)
TDP : జగన్ కు సోమిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
మాజీ ముఖ్యమంత్రి జగన్ కు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

మాజీ ముఖ్యమంత్రి జగన్ కు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని అన్నారు. గెలిస్తే తన గొప్ప, ఓడిపోతే ఈవీఎంల తప్పని జగన్ మాట్లాడుతున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ ఎందుకు ఓడిపోయారో ముందు ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిదని అన్నారు.
ఏపీ ఎలన్ మస్క్ లా...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎలన్ మస్క్ లా మాట్లాడుతున్నాని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. 2019 ఎన్నికల ఫలితాల అనంతరం జగన్ ఏం మాట్లాడారో అందరికీ తెలుసునని, దానిని గుర్తు చేయాలా? అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికైనా ఓటమికి సాకులు వెతకడం మాని అసలు కారణాలు తెలుసుకోవాలని సోమిరెడ్డి హితవు పలికారు.
Next Story

