Fri Mar 20 2026 02:37:30 GMT+0530 (India Standard Time)
పోలీస్ స్టేషన్లకు పసుపు రంగు వేస్తాం.. వైసీపీ మాజీ మంత్రి
చంద్రబాబు చేతకానితనం వాళ్ళ లా అండ్ ఆర్డర్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు

చంద్రబాబు చేతకానితనం వాళ్ళ లా అండ్ ఆర్డర్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.పోలీస్ స్టేషన్ లోనే పోలీసుల ముందే దాడి జరిగితే చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. చర్యలు తీసుకోకపోతే పోలీస్ స్టేషన్ కి పసుపు రంగు వేసి బోర్డు పెడతామని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుహెచ్చరించారు. సీదిరి అప్పలరాజును పలాసకు రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఆయన మండిపడ్డారు.
శాంతి భద్రతలు ఎక్కడ?
రాష్ట్రంలో శాంతి భద్రతలు పోలీసులు కాపాడే పరిస్థితి ఉందా? అని ఆయన ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్లంటే టీడీపీ పార్టీ ఆఫీసుల్లా మార్చేశారన్న సీదిరి అప్పలరాజు ఎదుటి పార్టీ వారిపై కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరింపోతే తాము న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
Next Story

