Fri Jun 20 2025 00:50:20 GMT+0000 (Coordinated Universal Time)
RK Roja : రెడ్ బుక్ పై రోజా సంచలన కామెంట్స్
టీడీపీ రెడ్ బుక్ అరెస్ట్ లపై మాజీ మంత్రి ఆర్కే రోజా మండి పడ్డారు.

టీడీపీ రెడ్ బుక్ అరెస్ట్ లపై మాజీ మంత్రి ఆర్కే రోజా మండి పడ్డారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో సెంటీమీటర్ చేస్తే వైసిపి అధికారంలో వచ్చాక కిలోమీటర్ చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులతో అరాచకం సృష్టిస్తుందన్న ఆర్కే రోజా రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఏర్పడ్డాయన్నారు. గంజాయి కి ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిందని, చంద్రబాబు నాయుడు నివాసం ఉన్న గుంటూరులో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతుందని రోజా ఆరోపించారు. పుత్తూరులో తెలుగు యువత నాయకులు డ్రగ్స్ విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారని, నగిరి నియోజకవర్గంలో విద్యార్థులు గంజాయి తాగి ప్రధానోపాధ్యాన్ని కాలర్ పట్టుకున్న సంఘటన జరిగిందన్న రోజా కుప్పంలో గంజాయి సాగు చేస్తున్నారని ఆరోపించారు.
రాజ్యాంగానికి విరుద్ధంగా...
రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాజ్యాంగానికి విరుద్ధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని, వైసిపి నాయకుల పై కేసులు పెట్టి బెయిల్ పొందేలోపు మరో కేసును పెడుతున్నారని అన్నారు. అన్ని కేసులకు పిటి వారంటీ ఇచ్చి ఒకే చోట విచారణ జరపాలని, అందుకు విరుద్ధంగా కొంతమంది పోలీసులు వ్యవహరిస్తున్నారన్నారు. పోసాని కృష్ణ మురళి కేసు కూడా ఇదేవిధంగా కేసులు పెడుతున్నారని, ఆయన ఆరోగ్యం సరిలేకపోయిన టార్చర్ పెడుతున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు తిలోదకాలు ఇచ్చి అధికార పార్టీ చెప్పినట్లు అధికారులు నడుస్తున్నారని రోజా వ్యాఖ్యానించారు. రాబోయేది వైయస్సార్ సిపి ప్రభుత్వం అధికారులను కూటమి ప్రభుత్వ నేతలను వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
Next Story