Thu Mar 19 2026 12:15:14 GMT+0530 (India Standard Time)
YSRCP : వైసీపీలో చేరిన మాజీ మంత్రి రావెల
మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.

మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. రావెల కిశోర్ బాబును జగన్ పార్టీలోకి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అందరినీ కలుపుకుని ముందుకు వెళతానని రావెల కిశోర్ బాబు తెలిపారు. వైసీపీ గెలుపును ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు.
పదవి ఆశించి...
తాను పదవి ఆశించి పార్టీలో చేరలేదని రావెల కిశోర్ బాబు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితుడనై పార్టీలో చేరానని అన్నారు. తాను పార్టీలో చేరడానికి ఎలాంటి షరతులు విధించలేదన్న రావెల కిశోర్ బాబు పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. వచ్చే ఎన్నికలలో తిరిగి వైసీపీ విజయం ఖాయమని ఆయన అన్నారు.
Next Story

