Thu Jan 16 2025 21:57:18 GMT+0000 (Coordinated Universal Time)
మడకశిరలో రఘువీరా ప్రచారం
మడకశిర నియోజకవర్గంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు
మడకశిర నియోజకవర్గంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ఆయన గడపగడపకు తిరుగుతున్నారు. మడకశిర నియోజకవర్గం నుంచి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సుధాకర్ పేరును ఖరారు చేశారు. సుధాకర్ కు మద్దతుగా రఘువీరారెడ్డి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
గడప గడపకు కాంగ్రెస్...
గ్రామ గ్రామంలో తిరుగుతూ ఓటు ఈసారి కాంగ్రెస్ కు వేయాలని ఆయన అభ్యర్థిస్తున్నారు. రఘువీరారెడ్డి గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ తన సొంత గ్రామమైన నీలకంఠాపురానికే పరిమితమయ్యారు. అయితే మళ్లీ ఈ ఎన్నికల సందర్భంగా యాక్టివ్ అయ్యారు. ఈ ఎన్నికల్లో రఘువీరారెడ్డి పోటీ చేయకుండా పార్టీ అభ్యర్థుల ప్రచారంలో తిరుగుతున్నారు. గడప గడపకు కాంగ్రెస్ పేరుతో ఆయన గ్రామాలను చుట్టివస్తున్నారు.
Next Story