Wed Jan 21 2026 08:39:40 GMT+0000 (Coordinated Universal Time)
Perni Nani : పోలీసులు అలా వ్యవహరించబట్టే ఈ గొడవలు
తెలుగుదేశం బలంగా ఉన్నచోట మాత్రమే ఈ అల్లర్లు జరిగాయని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు

తెలుగుదేశం బలంగా ఉన్నచోట మాత్రమే ఈ అల్లర్లు జరిగాయని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలీసు అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారన్నారు. మాచర్ల, నరసరావుపేట వంటి చోట్ల ఈ ఘర్షణలు ఎందుకు జరిగాయో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. పోలీసులు ఏకపక్షంగా వైసీపీ నేతలపై అక్రమంగా కేసులు పెడుతున్నారన్నారు. పోలీసులు ఒక కంట్లో కాటుక, మరొక కంట్లో కారం కొట్టినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. టీడీపీ నేతలు హత్యాయత్నం చేసినా వారిపై కేసులు నమోదు చేయలేదన్నారు. అసలు నిందితులను వదిలేసి అమాయకులపై కేసులు పెడుతున్నారన్నారు.
ఏకపక్షంగా వ్యవహరిస్తూ...
ముందుగానే అక్కడ రిగ్గింగ్ జరుగుతుందని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అధికారులకు చెప్పినా వాళ్లు పట్టించుకోలేదన్నారు. పాల్వాయిగేటు సమీపంలో బయటే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను ఓటింగ్ రానివ్వకుండా అడ్డుకున్నారన్నారు. టీడీపీ తమకు పట్టున్న గ్రామాల్లో రిగ్గింగ్ చేసుకున్నా పోలీసులు పట్టించుకోలేదన్నారు. పోలీసులు ఏకపక్షంగా మాచర్లలో వ్యవహరించారన్నారు. అక్కడ వారిపై కేసులు పెట్టబోగా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. హింస జరుగుతుందని ముందుగా తెలిసినా పోలీసులు చూసీ చూడనట్లు వదిలేశారన్నారు. పాల్వాయి గేటులో ఘర్షణలు జరిగితే అక్కడ కనీసం కేసు కూడా నమోదు చేయలేదన్నారు.
Next Story

