Thu Dec 18 2025 18:06:03 GMT+0000 (Coordinated Universal Time)
నేను లేకున్నా నాపై కేసు పెట్టారు : పేర్ని నాని
అధికార పార్టీ నేతలను సంతృప్తి పర్చేందుకు వల్లభనేని వంశీపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు

అధికార పార్టీ నేతలను సంతృప్తి పర్చేందుకు వల్లభనేని వంశీపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఈ నెల 10వ తేదీన సత్వర్థన్ కోర్టులో స్టేట్ మంట్ ఇచ్చారన్న పేర్ని నాని 11వ తేదీన ఐదు క్రిమినల్ కేసులు ఉన్న టీడీపీ వ్యక్తితో ఫిర్యాదు తీసుకుని కేసు పెట్టారని తెలిపారు. 12వ తేదీన సత్యవర్థన్ సోదరుడి ఫిర్యాదు చేయించి కేసు పెట్టారని పేర్ని నాని తెలిపారు.
గుంటూరుకు వెళ్లకపోయినా...
ఎఫ్ఐఆర్ లో ఉన్న సెక్షన్లకు కేసుతో సంబంధం లేదని తెలిపారు. పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్న నాని, తాను గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లలేదని తెలిపారు. జగన్ గుంటూరుకు వెళ్లిన సమయంలో తాను మచిలీపట్నంలోనే ఉన్నానని అయినా తనపై కేసు పెట్టారన్నారు. కొల్లు రవీంద్ర ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, తనను అరెస్ట్ చేస్తే చేసుకోవచ్చని పేర్ని నాని అన్నారు.
Next Story

