Mon Feb 02 2026 07:48:51 GMT+0000 (Coordinated Universal Time)
ఎందుకీ విచిత్ర ప్రకటనలు?
బందరు పోర్టుపై తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు

బందరు పోర్టుపై తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. 2014 నుంచి 2019 వరకూ బందరు పోర్టు పనులు ఎంత వరకూ పూర్తయ్యాయో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. బందరు పోర్టును గత ప్రభుత్వం పట్టించుకోకుండా పూర్తిగా వదిలేసిందన్నారు.
తమ ప్రభుత్వ హయాంలోనే...
తమ ప్రభుత్వ హయాంలోనే బందరు పోర్టు విషయంలో వేగంగా అడుగులు పడ్డాయని పేర్ని నాని తెలిపారు. కొల్లు రవీంద్ర విచిత్ర ప్రకటనలు చేశారని ఆయన అన్నారు. ఆయన తన అంతరాత్మను ప్రశ్నించుకోవాల్సి ఉందని పేర్ని నాని అన్నారు. బందరు పోర్టు నిర్మాణాన్ని త్వరితగతితన పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.
Next Story

