Sat Dec 06 2025 17:30:08 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ కు ఆ శాపం ఉందేమో
రాజకీయాల్లో విలువలు, నిబద్దత లేని నేత పవన్ కల్యాణ్ అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు

రాజకీయాల్లో విలువలు, నిబద్దత లేని నేత పవన్ కల్యాణ్ అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. పవన్ పార్టీ కార్యకర్తలే సిగ్గుపడేలా వ్యవహరిస్తున్నాడన్నారు. మూడు కాకుంటే ముప్ఫయి పెళ్లిళ్లు చేసుకోవాలని, అందరికీ భరణం ఇచ్చుకొమ్మని పేర్ని నాని సలహా ఇచ్చారు. అదే సమయంలో ఆ పిచ్చి చేష్టలను అందరూ చేయాలని పిలుపు నివ్వవద్దని నాని కోరారు. పవన్ కు షూటింగ్ లు లేనప్పుడే పార్టీ గుర్తుకు వస్తుందన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు.
గ్యాప్ వచ్చిందని...
చంద్రబాబుకు నిజం చెబితే వెయ్యి ముక్కలవుతుందని శాపముందని, పవన్ కల్యాణ్ కు మాట మీద నిలబడితే తల ముక్కలవుతుందేమోనని ఎద్దేవావ చేశారు. పవన్ కల్యాణ్ కార్యక్రమాలను ప్రభుత్వం ఆపలేదన్నారు. మూడు రోజులు షూటింగ్ కు గ్యాప్ దొరకడంతో వచ్చి రచ్చ చేశాడని, మళ్లీ యధాతధంగా ఆయన షూటింగ్ లకు వెళ్లిపోతారన్నారు. ప్రజలు ఆయన చేసే పనులను, మాటలను విశ్వసించరని పేర్ని నాని అభిప్రాయపడ్డారు. విశాఖ నుంచి కదలనని చెప్పిన పవన్ కల్యాణ్ మరి ఎందుకు కదిలారని ఆయన ప్రశ్నించారు.
Next Story

