Fri Dec 05 2025 17:34:09 GMT+0000 (Coordinated Universal Time)
వారిని చూస్తే చంద్రబాబుకు భయం
నందమూరి వారసులను చూసి చంద్రబాబు భయపడిపోతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.

నందమూరి వారసులను చూసి చంద్రబాబు భయపడిపోతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. పోలీసుల మధ్య బతుకుతూ వారి గురించి అసభ్యకరంగా మాట్లాడటమేంటని ప్రశ్నించారు. పోలీసులు లేకుండా ఒక్క నిమిషం కూడా బయటకు రాలేని నారా కుటుంబ సభ్యులు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడమేంటన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కుప్పం సభలో తెగించి అబద్ధాలాడుతున్నారన్నారు. చంద్రబాబు కంటే లోకేష్ పార్టీ కార్యకర్తలను బాగా చూసుకుంటాడని చెప్పడమేంటని పేర్ని నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కంటే లోకేష్ బెటర్ అని అచ్చెన్న చెప్పారా? అంటూ సెటైర్ వేశారు.
వారి మాటలను నమ్ముతారా?
లోకేష్, చంద్రబాబు చెప్పే మాటలను ప్రజలు నమ్మరన్నారరు. చంద్రబాబు మంచి పనులు చేస్తే లోకేష్ ఎందుకు ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడని ప్రశ్నించారు. పాదయాత్రలో తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పకుండా జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడమేంటని అన్నారు. లోకేష్ ప్రసంగాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారని పేర్ని నాని అన్నారు. ఎవరెన్ని యాత్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని, జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావడం అనివార్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Next Story

