Fri Dec 05 2025 22:46:12 GMT+0000 (Coordinated Universal Time)
గడ్డం పెంచుకున్నాడనుకుంటే... కొడాలిపై నాని
మాజీ మంత్రి పేర్ని నాని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

మాజీ మంత్రి పేర్ని నాని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గడ్డంపెంచుకుని, మెడలో రుద్రాక్షలో వేసుకున్నాడని రౌడీ కన్పిస్తాడని అన్నారు. అయితే ఆయన బుర్ర పాదరసం వంటి దని పేర్ని నాని మెచ్చుకున్నారు. కొడాలి నాని ఓడించేందుకు గుడివాడలో ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారని, వారి వల్ల కాదని పేర్ని నాని స్పష్టం చేశారు.
మనసు వెన్న...
కొడాలి నాని మనసు కూడా వెన్న లాంటి దని, ఆయనను ప్రజలు నాలుగు సార్లు ఎన్నుకున్నారంటే అందులోనే అసలు విషయం తెలుస్తుందని చెప్పారు. ఐదోసారి గెలిచేందుకు కొడాలి నాని స్కెచ్ ను ఇప్పటికే సిద్ధం చేసుకున్నారని కూడా పేర్ని నాని తెలిపారు. గుడివాడలో కొడాలి నానికి తిరుగులేదని అన్నారు. పైకి కనిపించే రూపం ఒకలా, మనసు మరోలా ఉండబట్టే ఆయనను ప్రజలు ఆదరిస్తున్నారని కితాబిచ్చారు.
Next Story

