Fri Dec 05 2025 10:21:49 GMT+0000 (Coordinated Universal Time)
Perni Nani : బాలకృష్ణది బట్టీ జీవితం.. అతనో పెద్ద సైకో
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పై మాజీ మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు

బాలకృష్ణ తప్పతాగి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారంటూ మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. పురాణాలు నోట్లో వల్లె వేయడం కాదని, దేవుడి పద్యాలు బట్టీ పట్టడం కాదని, బట్టీ పట్టే జీవితం పనికి రాదని పేర్నినాని అన్నారు. మాన్షన్ హౌస్ నాలుగు పెగ్గులేస్తే ఇలాగే ఉంటుందని అన్నారు. కామినేని శ్రీనివాస్ చిరంజీవిని పొగిడితే తట్టుకోలేక జగన్ తో పాటు చిరంజీవిని కూడా అసెంబ్లీలో తూలనాడారన్నారు. ఇక రానున్న కాలంలో బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లను అసెంబ్లీలో కూడా చేయాల్సి ఉంటుందేమోనని పేర్ని నాని అన్నారు. బాలకృష్ణను మించిన సైకో మరొకరు ఉండరనిపేర్ని నాని అన్నారు. కామినేని శ్రీనివాస్ అంత వయసున్నా తప్పుడు మాటలు అసెంబ్లీ చెప్పారని పేర్ని నాని అన్నారు.
తల్లిదండ్రుల సంస్కారం...
నందమూరి రామరావు, బసవతారకరామారావులు ఎంత సంస్కారవంతులో వారికి పుట్టిన బాలకృష్ణ కు సంస్కారం రాలేదని పేర్నినాని అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ తో తాను కలుస్తానని బాలకృష్ణ తనకు ఫోన్ చేసి అడిగారని, తాను జగన్ అడిగితే ఎందుకని ప్రశ్నించారన్నారు. తన సినిమాకు టిక్కెట్ ధరలను పెంచడానికి వస్తున్నట్లుందని తాను చెప్పానని అనడంతో జగన్ బాలకృష్ణ అడిగింది చేయండి అని తనతో జగన్ అన్నారని, అంత హుందాగా ప్రవర్తించిన జగన్ గురించి ఇలా మాట్లాడతారా? అని బాలకృష్ణ ను ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సాయం బాలకృష్ణ మర్చిపోయారా? అని పేర్ని నాని నిలదీశారు. బసవతారకం ఆసుపత్రికి చంద్రబాబు నాయుడు బిల్లులు పెండింగ్ లో పెడితే జగన్ వచ్చిన తర్వాత క్లియర్ చేయడం నిజం కాదా? అని నిలదీశారు.
Next Story

