Fri Mar 27 2026 05:49:41 GMT+0530 (India Standard Time)
పవన్ నమ్ముకుంటే ఇక అంతే
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు కళ్లల్లో ఆనంద కోసంే పవన తాపత్రయపడుతున్నారని ఆయన అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ నమ్ముకుంటే కుక్క తోకను పట్టుకుని గోదారిని ఈదినట్లేనని ఆయన అన్నారు. ఇప్పటంలో ఏ ఇంటిని కూల్చలేదని అక్కడ ప్రజలు చెబుతున్నారని, కోర్టు అక్షింతలు ఇంకా బుద్ది రాలేదన్నారు. న్యాయస్థానం విధించిన జరిమానా ఎవరు చెల్లిస్తారని అన్నారు.
బాబు అన్యాయం చేసినా...
రైతులకు చంద్రబాబు అన్యాయం చేసినప్పుడు పవన్ కల్యాణ్ ఎటు వెళ్లారని పేర్ని నాని ప్రశ్నంచారు. పవన్ మాటల్లో జగన్ పై విధ్వేషం తప్ప మరొకటి కాదని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చివేయడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. నిత్యం ముఖ్యమంత్రి జగన్ మీద పడి ఏడ్వటం తప్ప మరొక పని పవన్ కు లేదన్నారు. పార్టీ పెట్టి ఇతర పార్టీల వైపు చూసే పవన్ ను ప్రజలు ఎవరూ విశ్వసించరని పేర్ని నాని పేర్కొన్నారు. చంద్రబాబు అధికారంలో ఉంటే ఒక వ్యూహం లేకుంటే మరొక వ్యూహం అవలంబించడం పవన్ కు అలవాటు అని పేర్ని నేని అన్నారు.
Next Story

