Wed Dec 17 2025 08:48:34 GMT+0000 (Coordinated Universal Time)
165 స్థానాలు టీడీపీకి ఖాయం
మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ గ్రాఫ్ పడిపోతుందని ఆయన తెలిపారు

మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ గ్రాఫ్ పడిపోతుందని ఆయన తెలిపారు. వరదలతో ముఖ్యమంత్రి జగన్ గ్రాఫ్ మరింత పడిపోయిందని పత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యమంత్రి జగన్ తాకట్టు పెట్టారన్నారు. స్వప్రయోజనాల కోసమే జగన్ ఏ పనినైనా చేస్తారని, ఒక పని చేస్తే దాని వెనక చాలా ప్రయోజనాలు ఆశిస్తారని పత్తిపాటి పుల్లారావు తెలిపారు.
అలివికాని హామీలతో...
అబద్ధాలతో అలివికాని హామీలతో ప్రజలను జగన్ మోసం చేస్తున్నాడని పత్తిపాటి పుల్లారావు అన్నారు. జే ట్యాక్స్ పేరుతో దోపిడీకి దిగుతున్నారననారు. పోలీసులను అడ్డుపెట్టుకుని తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. ప్రజాదరణ కోల్పోయే ఫ్యాక్షన్ రాజకీయాలకు జగన్ తెరలేపాడని పత్తిపాటి పుల్లారావు అన్నారు. చంద్రబాబు పరిపాలనలో పోలవరం ప్రాజెక్టును 75 శాతం పూర్తి చేశారని, కానీ ఆ ప్రాజెక్టు విషయంలో జగన్ కు ఒక క్లారిటీ లేకుండా పోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 165 శాసనసభ స్థానాలను దక్కించుకుంటుందని పత్తిపాటి పుల్లారావు జోస్యం చెప్పారు.
Next Story

