Sun Mar 15 2026 15:02:12 GMT+0530 (India Standard Time)
Balineni : బాలినేని ఫ్రస్టేషన్ పీక్ కు చేరుకుందిగా
మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు

మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీనామా చేయడం ఎంతో సేపు పట్టదని ఆయన అన్నారు. అసంతృప్తితో రాజీనామా చేయడం నిమిషమని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లాలో తాను సూచించిన వారికి ఎవ్వరికీ టిక్కెట్లు ఇవ్వలేదని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.
తనకు తెలియకుండానే...
కొండపి, సంతనూతలపాడు అభ్యర్థులను తనకు తెలియకుండానే మార్చారని బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత తనదేనన్న బాలినేని చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్ గా మారాయి. బాలినేని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఇవ్వాలని కూడా పట్టుపడుతున్నారు. ఆయనకు ఇచ్చే అవకాశం లేకపోవడంతో బాలినేని ఫ్రస్టేషన్ తో ఈ కామెంట్స్ చేసినట్లు తెలిసింది.
Next Story

