Mon Dec 15 2025 08:45:20 GMT+0000 (Coordinated Universal Time)
భయం నా బయోడేటాలోనే లేదు : లోకేష్
తాను ప్రజలకు తప్ప ఎవరికీ భయపడనని మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. భయం అనేది తన బయోడేటాలోనే లేదన్నారు.

తాను ప్రజలకు తప్ప ఎవరికీ భయపడనని మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. భయం అనేది తన బయోడేటాలోనే లేదన్నారు. కుప్పంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ఆవేశంగా ప్రసంగించారు. తాను పాదయాత్ర చేస్తున్నాననగానే వైసీీపీ నేతల గుండెల్లో దడ ప్రారంభమయిందన్నారు. ఏ అర్హతతో పాదయాత్ర చేస్తున్నావని ప్రశ్నిస్తున్నారని, తాను ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చేసిన అభివృద్ధి పనులు చేశానని తెలిపారు. వేలాది మందికి ఉపాధి కల్పించానని తెలిపారు.
జాదూరెడ్డి...
ఆ అర్హతతోనే తాను పాదయాత్ర చేస్తున్నానని లోకేష్ తెలిపారు. మూడేళ్లలో ఈ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందని లోకేష్ ప్రశ్నించారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలకు చేసిందేమిటని నిలదీశారు. మైసూర్ బోండాలో మైసూర్ లేనట్లే జగన్ జాబ్ క్యాలెండర్లలో ఉద్యోగాలు ఉండవన్నారు. జాదూరెడ్డి ఇసుకదోపిడీతో వేల కోట్లు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన జగన్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Next Story

