Sat Dec 06 2025 08:06:40 GMT+0000 (Coordinated Universal Time)
ఒక్కసారి అవకాశం ఇవ్వండి ప్లీజ్
తనకు ఎమ్మెల్యేగా 2024లో ఒక్కసారి అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి నారా లోకేష్ మంగళగిరి ప్రజలను కోరారు.

తనకు ఎమ్మెల్యేగా 2024లో ఒక్కసారి అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి నారా లోకేష్ మంగళగిరి ప్రజలను కోరారు. వైసీపీకి అవకాశమిస్తే ఏం జరిగిందో చూశామని లోకేష్ అన్నారు. మంగళగిరిలో నారా లోకేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత ఆయనలో రౌడీ లక్షణాలు పెరిగిపోయాయని లోకేష్ అన్నారు.
ఏం చేసిందని...?
ఈ మూడేళ్లలో జగన్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని నారా లోకేష్ చెప్పారు. మంత్రివర్గాన్ని మార్చినా ప్రజలకు ఒరిగేదేమీ లేదని లోకేష్ అన్నారు. ప్రజలు వైసీపీ అసమర్థపాలనను గుర్తించాలని, వచ్చే ఎన్నికల్లో తనను మంగళగిరి నుంచి గెలిపించాలని నారా లోకేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Next Story

