Mon Dec 08 2025 13:01:27 GMT+0000 (Coordinated Universal Time)
రైతులు రెచ్చగొడుతున్నారు.. అక్కడి నుంచే యాత్ర
అమరావతి రాజధాని రైతులు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు.

అమరావతి రాజధాని రైతులు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. మంచి నాయకత్వం ఉన్న నియోజకవర్గాలను ఎంచుకుని అక్కడి నుంచి యాత్ర జరిగేలా రూట్ ప్లాన్ చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ కు నాటకాలు ఆడటం తెలియదన్నారు. అమరావతి లేకుంటే దేశమే లేదన్నట్లు బిల్డప్ ఇస్తున్నారన్నారు. చంద్రబాబు కోరుకున్న, మీ భూముల విలువ రాత్రికి రాత్రికి పెరిగే రాజధాని అమరావతిలోకి రాదన్నారు. అమరావతిలో రాజధాని కొనసాగుతుందని కన్న బాబు చెప్పారు. వందేళ్లలో కూడా అది సాధ్యం కాదన్నారు.
రాజధానిని తీసివేశారా?
అమరావతిలో శాసన రాజధాని ఉందని, అమరావతి బాగుండాలని మీరు అనుకుంటున్నప్పుడు, ఇతర ప్రాంతాల వాళ్లు తమ ప్రాంతం బాగుండాలని ఎందుకు కోరుకోరని కన్నబాబు ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా వీరికి వత్తాసు పలుకుతూ విశాఖ అభివృద్ధికి గండి కొడుతున్నారన్నారు. సీపీఐ చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియాగా మారిందన్నారు. అక్కడ అమరావతి మహానగరాన్ని చంద్రబాబు నిర్మిస్తే ఈ ప్రభుత్వం వచ్చి విధ్వంసం చేసినట్లు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు లాగా మాటలు మార్చే నేత ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా? అని కన్నబాబు ప్రశ్నించారు. హైదరాబాద్ లో కాపురం, ఆంధ్రప్రదేశ్ పై పెత్తనం చేస్తున్న వారిని తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
Next Story

