Fri Dec 05 2025 23:16:45 GMT+0000 (Coordinated Universal Time)
మున్సిపల్ వాహనాన్ని ఎవరైనా ఆపుతారా? వారాహి అంతే
జగన్ పై మాట్లాడే అర్హత లోకేష్ కు లేదని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు

జగన్ పై మాట్లాడే అర్హత లోకేష్ కు లేదని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. లోకేష్ కు ఏం అర్హత ఉండి పాదయాత్ర చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. లోకేష్ టీడీపీని భ్రష్టుపట్టించడానికే పాదయాత్ర చేపట్టాడని అన్నారు. లోకేష్ పాదయాత్రకు ప్రజా స్పందన లేకపోవడమే దీనికి ఉదాహరణ అని ఆయన అన్నారు.
రాజకీయ అనుభవమేంటి?
మున్సిపల్ వాహనాలను ఎవరూ రాష్ట్రంలో ఆపరని అన్నారు. వారాహిని కూడా ఎవరూ అడ్డుకోరన్నారు. పవన్, లోకేష్ లను ఎవరూ ఆపరని కూడా అన్నారు. లోకేష్ కు ఉన్న రాజకీయ అనుభవం ఏమిటిన కొడాలి నాని ప్రశ్నించారు. లోకేష్ మంత్రిగా ఉండగా ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని కొడాలని నాని కోరారు.
Next Story

