Fri Dec 05 2025 20:16:24 GMT+0000 (Coordinated Universal Time)
కోటంరెడ్డికి చంద్రబాబు మంత్రి పదవి ఆఫర్
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి చంద్రబాబు మంత్రి పదవి ఇస్తానని ఆఫర్ ఇచ్చి ఉంటారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు

కోటంరెడ్డికి చంద్రబాబు మంత్రి పదవి ఇస్తానని ఆఫర్ ఇచ్చి ఉంటారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఫోన్ ట్యాప్ చేయాల్సిన ఖర్మ ఎవరికీ పట్టలేదన్నారు. పార్టీ మారాలనుకున్నాడు కాబట్టే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారన్నారు. మంత్రి పదవి ఇస్తారని జగన్ ఎవరికీ చెప్పరన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే ఎక్కువ ప్రాధాన్యం జగన్ కల్పిస్తారన్నారు. తన సామాజికవర్గానికి చెందిన చాలా మందికి మంత్రి పదవులు ఇవ్వలేదన్నారు. మళ్లీ గెలిచినా తనకు మంత్రి పదవి రాదన్న అనుమానంతోనే ఆయన పార్టీని వీడి వెళుతున్నారన్నారు.
చంద్రబాబు అయితే...
అదే చంద్రబాబు అయితే జిల్లాకొక కమ్మ కు మంత్రి పదవి ఇస్తారన్నారు. ఆయనకు ఒకటి, ఆయన కొడుకుకు ఒకటి, దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత ఇలా అందరికీ వాళ్లకే ఇస్తారని, మైనారిటీలకు మాత్రం ఇవ్వడానికి ఆయనకు మనసొప్పదని చెప్పారు. తన లాంటి అనామకులందరికీ జగన్ సీటు ఇచ్చారని కోటంరెడ్డి చెప్పుకున్నారని అన్నారు. ఇలాంటి వాళ్లంతా పార్టీ నుంచి వెళితేనే మంచిదని కొడాలి నాని అభిప్రాయపడ్డారు. అర్ధం చేసుకోలేని నలుగురైదురుగు వెళ్లిపోతే పార్టీకి ఏం కాదని కొడాలి నాని అన్నారు. ఇంటలిజెన్స్ డీజీ ప్రభుత్వంలో భాగమేనని, ఆయన ఫోన్ చేసి చెప్పడం తప్పెలాఅవుతుందని కొడాలి నాని ప్రశ్నించారు.
Next Story

