Thu Mar 19 2026 06:27:52 GMT+0530 (India Standard Time)
చంద్రబాబు సభలకు అనుమతివ్వొద్దు
చంద్రబాబు సభలకు అనుమతి ఇవ్వవద్దని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని అన్నారు

చంద్రబాబు సభలకు అనుమతి ఇవ్వవద్దని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని అన్నారు. లోకేష్ పాదయాత్ర అని ప్రకటించగానే కందుకూరులో ఎనిమిది మంది చనిపోయారన్నారు. చంద్రబాబు కాలు పెట్టగానే చనిపోతున్నారని అన్నారు. తాము చేసిన నేరాన్ని పోలీసులపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు పట్టిన శని ఇప్పట్లో వదలదని, ఆయన సభలకు రావడానికి కూడా ప్రజలు భయపడుతున్నారన్నారు.
న్యాయ విచారణ చేయాలని....
చంద్రబాబు సభలను పెట్టడం మానుకోవాలని హితవుపలికారు. తన ప్రసంగం కోసం మధ్యాహ్నం 2 గంటల నుంచి మహిళలను నిలబెట్టారన్నారు. ఈ మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి రావడానికి ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపే ప్రయత్నంలో భాగంగా మరణాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఈ ఘటనలపై న్యాయ విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story

