Fri Dec 05 2025 15:26:39 GMT+0000 (Coordinated Universal Time)
తనకు ఓటమి భయం వాస్తవమే: కొడాలి నాని
వంగవీటి రంగా హత్యపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు

వంగవీటి రంగా హత్యపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగాను చంపింది టీడీపీ నేతలేనని తెలిపారు. చంద్రబాబు హస్తం కూడా ఉందని ఆయన ఆరోపించారు. గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రంగా అభిమానులతోనే తన రాజకీయంగా కలసి నడుస్తున్నానని తెలిపారు. రంగా హత్య కేసులో ముద్దాయిలు టీడీపీలోనే ఉన్నారని అన్నారు. రంగా హత్య అనంతరం రావి కుటుంబంపై రంగా అభిమానులు ఎందుకు దాడి చేశారని ప్రశ్నించారు. రావి కుటుంబం ఎందుకు గుడివాడను వదిలి ఆరోజు పారిపోయిందని అన్నారు.
రంగా హత్యలో...
రంగాను అడుగడుగునా తొక్కేయాలని ఆనాడు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని కొడాలి నాని అన్నారు. రంగా హత్యకు కారణమైన పార్టీలు దిగజారి మాట్లాడుతున్నాయని తెలిపారు. రంగా కుటుంబంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని కొడాలి నాని అన్నారు. తనకు ఓటమి భయం ఉందని కొడాలి నాని అంగీకరించారు. ఓటమి భయం ఉండబట్టే తాను గెలుస్తున్నానని, ప్రజల పట్ల భక్తితో నడుచుకుంటున్నానని అన్నారు. చంద్రబాబు పర్యటనలకు జనం పెద్దగా రాకపోయినా ఆయన అనుకూల మీడియా మాత్రం బ్రహ్మరధం పడుతున్నట్లు ప్రచారం చేస్తుందని, బ్రహ్మ తన రధాన్ని చంద్రబాబుకు వదలి వెళ్లారా? అని ఆయన ఎద్దేవా చేశారు.
Next Story

