Wed Mar 18 2026 05:47:19 GMT+0530 (India Standard Time)
టీడీపీకి కీలక నేత గుడ్ బై.. ఫ్యాన్ పార్టీలోకేనంటూ
టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో మాజీమంత్రి కేఈ ప్రభాకర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.

టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో మాజీమంత్రి కేఈ ప్రభాకర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారని సమచారం. కుమారుడు రుద్ర ఒత్తిడి మేరకే వైసీపీ వైపు ప్రభాకర్ మొగ్గు చూపుతున్నారని పార్టీ వార్గాలు వెల్లడించాయి. ఈసారి పత్తికొండ టిక్కెట్ ఒక్కటే కేఈ కుటుంబానికి ఇచ్చారు.
ఒకే టిక్కెట్ ఇవ్వడంతో...
కేఈ కుటుంబంలో ఒక్క కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబు కు టిక్కెట్ ఇచ్చారు. కేఈ ప్రభాకర్ కు మాత్రం ఎక్కడా సీటు కేటాయించలేదు. దీంతో ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారని తెలిసింది. త్వరలోనే ఆయన వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

