Fri Dec 05 2025 11:40:50 GMT+0000 (Coordinated Universal Time)
Kakani : నేటి నుంచి మాజీ మంత్రి కాకాణి సిట్ కస్టడీలోకి
నేటి నుంచి మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని స్పెషల్ ఇన్విస్టిగేషన్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు

నేటి నుంచి మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని స్పెషల్ ఇన్విస్టిగేషన్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. రెండు రోజుల పాటు కస్టడీకీ కాకాణిని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడంతో రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకుని సిట్ అధికారులు విచారించనున్నారు. ప్రస్తుతం కాకాణి గోవర్థన్ రెడ్డి నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
మాగుంట సంతకాన్ని...
సర్వేపల్లి రిజర్వాయర్ లో గ్రావెల్ అక్రమ రవాణాకు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు దీనిపై విచారించనున్నారు. ఈ కేసులో ఏ2 నిందితుడుగా మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఉన్నారు. రెండు రోజుల కస్టడీ అనంతరం తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించి జైలుకు తరలించనున్నారు.
Next Story

