Fri Mar 20 2026 04:56:26 GMT+0530 (India Standard Time)
నేడు విచారణకు జోగి రమేష్
మాజీ మంత్రి జోగి రమేష్ నేడు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు

మాజీ మంత్రి జోగి రమేష్ నేడు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకు దాడికి దిగిన కేసులో పోలీసులు జోగి రమేష్ కు పోలీసులు నిన్ననే నోటీసులు ఇచ్చారు. నిన్న సాయంత్రమే ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, కుమారుడు రాజీవ్ అరెస్ట్ కావడంతో ఈరోజు విచారణకు హాజరవుతానని తెలిపారు.
విచారణకు వచ్చే టప్పుడు....
అయితే విచారణకు వచ్చేటప్పుడు 2022 లో వినియోగించిన మొబైల్ ఫోన్ ను తీసుకురావాలని పోలీసులు కోరారు. చంద్రబాబు ఇంటికి వెళ్లిన వాహనాల నెంబర్లు ఇవ్వాలని జోగి రమేష్ ను కోరారు. దీంతో నేడు జోగి రమేష్ అన్ని వివరాలతో నేడు పోలీసుల ఎదుటకు విచారణకు హాజరుకానుండటంతో ఉత్కంఠ నెలకొంది.
Next Story

