Fri Dec 05 2025 23:16:39 GMT+0000 (Coordinated Universal Time)
సీఎం నివాసం ఎదుట జేసీకి పరాభవం
మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కి ముఖ్యమంత్రి నివాసం ఎదుట అవమానం జరిగింది.

మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కి ముఖ్యమంత్రి నివాసం ఎదుట అవమానం జరిగింది. జేసీ దివాకర్ రెడ్డి తెలంగాణ మంత్రి కేటీఆర్ ను కలిసేందుకు ప్రగతి భవన్ కు వచ్చారు. అయితే అపాయింట్ మెంట్ లేనిదే ఎవరినీ అనుమతించేది లేదని అక్కడ సెక్యూరిటీ అధికారులు తెలిపారు.
సెక్యూరిటీ అడ్డుకోవడంతో....
జేసీ దివాకర్ రెడ్డి కేటీఆర్ ను ఎందుకు కలవాలని వచ్చారో కారణం తెలియదు కాని అపాయింట్ మెంట్ లేకుండా రావడం వల్లనే ఆయనకు ఈ అవమానం జరిగిందని చెబుతున్నారు. సెక్యూరిటీ అడ్డుకోవడంతో జేసీ దివాకర్ రెడ్డి ఆయనను కలవకుండానే వెళ్లిపోయారు.
Next Story

