Sat Mar 07 2026 22:46:35 GMT+0530 (India Standard Time)
YSRCP : వైసీపీ ఓటమికి అసలు కారణం చెప్పిన మాజీ మంత్రి
మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఆంధ్రప్రదేశ్ లో ఓటమి పాలు కావడానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ తెలిపారు

మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఆంధ్రప్రదేశ్ లో ఓటమి పాలు కావడానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ తెలిపారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కూల్చివేయడం వల్లనే ఇంతటి దారుణ ఓటమిని చవిచూశామని గుడివాడ అమర్నాధ్ తెలిపారు. లేకపోతే ఈరోజు అధికారంలోకి వచ్చి ఉండేవాళ్లమని తెలిపారు.
ఈ ప్రభుత్వం కూడా...
కూల్చివేతలే లేకపోతే తామందరం ఈరోజు అసెంబ్లీలో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసేవారమని గుడివాడ అమర్నాధ్ అన్నారు. విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విధంగా స్పందించారు. కూల్చివేతల వల్లనే ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చిందన్న గుడివాడ అమర్నాధ్ ఇప్పటి ప్రభుత్వం కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని వ్యవహరిస్తే మంచిదని సూచించారు.
Next Story

