Fri Dec 05 2025 09:23:50 GMT+0000 (Coordinated Universal Time)
రుషికొండ భవనంలో పవన్ డ్రామా ఇదిగో : గుడివాడ అమర్ నాధ్
రుషికొండ భవనంలో పవన్ కల్యాణ్ పెద్ద డ్రామా చేశారని మాజీ మంత్రి గుడివాడ అమర్ నాధ్ అన్నారు

రుషికొండ భవనంలో పవన్ కల్యాణ్ పెద్ద డ్రామా చేశారని మాజీ మంత్రి గుడివాడ అమర్ నాధ్ అన్నారు. రుషికొండ భవనాలను రాజకీయంగా వాడుకునేందుకు కూటమి నేతలు పోటీ పడుతున్నారని అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కావాలని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కప్పులను కట్ చేసినట్లు స్పష్టంగా ఫొటోల్లో కనపడుతుంది. అమరావతిలో వర్షం పడితే సెక్రటేరియట్ లోకి కూడా వెళ్లలేమని ఆయన అన్నారు. చదరపు అడుగుకు పదమూడు వేల కోట్ల రూపాయలతో చంద్రబాబు నిర్మించిన తాత్కాలిక భవనం వర్షాలకు ఎలా పాడై పోయిందో అందరూ చూశారని అన్నారు.
సెక్రటేరియట్ కూలితే...
ఏ రోజు కూడా పవన్ కల్యాణ్ అక్కడకు వెళ్లలేదని, ఇది రాజకీయం కాదా? అని గుడివాడ అమర్ నాధ్ ప్రశ్నించారు. అమరావతిలో వర్సం పడితే సెక్రటేరియట్ ఎందుకు లీకవుతుందో అని ఆయన ప్రశ్నించలేకపోయారని గుడివాడ అమర్ నాధ్ ఎద్దేవా చేశారు. తప్పుడు ప్రచారం, బోగస్ వదంతులు సృష్టిస్తూ రుషికొండ ప్యాలెస్ అంటూ రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. పవన్ కల్యాణ్ మాటలను రాష్ట్ర ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని, ఆ ఫొటోలను చూస్తే కావాలని చేసినట్లుందని గుడివాడ అమర్ నాధ్ అన్నారు.
Next Story

